మంచి చేద్దామంటే మృత్యువు కబళించింది

1036చూసినవారు
ఆటోలో దొరికిన గోల్డ్ చైన్ పోలీసులకు అప్పగిద్దామని వచ్చి స్టేషనులోనే గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం హైదరాబాద్ షాహినాయత్ గంజ్ పోలీసు స్టేషనులో ఈ ఘటన జరిగింది. రామ్సోని(70) అనే వృద్ధుడు ఆటోలో ప్రయాణిస్తుండగా గోల్డ్ చైన్ దొరికింది. దానిని తీసుకుని గంజ్ పోలీసు స్టేషన్ కు వచ్చాడు. అంతలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్