విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్.. ఎగిసిపడ్డ మంటలు

1040చూసినవారు
ఫిలిం నగర్ పీఎస్ పరిధిలోని షేక్ పేట ద్వారకామాయి నగర్ లో మెయిన్ రోడ్డు వద్ద విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సుమారు 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక ప్రజలు గమనించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వేర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్