హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసులో సినీ పరిశ్రమ పెద్దలతో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో అనేక విషయాలను సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం. టికెట్ల రేట్ల పెంపు ఉండదనే విషయాన్నిరేవంత్ వారికి స్పష్టంగా తెలియజేసినట్లు తెలుస్తుంది. రెండు గంటల పాటు సాగుతున్న ఈ భేటీ మరికొద్ది నిమిషంలో ముగుస్తున్నట్లు తెలుస్తోంది.