హైదరాబాద్: ఐటీ ఉద్యోగికి రూ. 2.29 కోట్లు టోకరా

63చూసినవారు
హైదరాబాద్: ఐటీ ఉద్యోగికి రూ. 2.29 కోట్లు టోకరా
లాభాలు వస్తాయంటూ ఆశచూపిన సైబర్‌ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగి నుంచి రూ. 2.29 కోట్లు కాజేశారు. ఓ ఐటీ ఉద్యోగి 'బీ2231కేఎస్‌ఎల్‌ అఫిషియల్‌ స్టాక్‌' అనే వాట్సప్‌ గ్రూప్‌లో జాయిన్‌ అయ్యాడు. ఉద్యోగి అది నమ్మి కొటక్‌ప్రో పేరుతో ట్రేడింగ్‌లో రిజిస్టర్‌ చేసి మొత్తం రూ. 2.29 కోట్లు స్టాక్‌ల కోసం డిపాజిట్‌ చేశాడు. ఆ డబ్బును సైబర్‌ మోసగాళ్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన ఉద్యోగి సైబరాబాద్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్