హైదరాబాద్: ‘ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం అన్నారు. రైతుల గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలు కెళ్తానన్నారు. ‘కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్ చేస్కో రేవంత్రెడ్డి’ అని సవాల్ విసిరారు. ‘‘ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అని కేటీఆర్ ఆరోపించారు.