మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 15 వ లోక్ సభలో తాను ఆయనతో కలిసి పని చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారన్నారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఘర్షణలో గుండెపోటు వచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని వదళలేదని, మొండి పట్టుతో అయన జీవితం అంతా ముందుకు సాగారని కొనియాడారు.