ఆషాఢ మాసం భోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, విస్తారంగా వర్షాలు కురువాలని కోరుకున్నట్లు తెలిపారు.