సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

1562చూసినవారు
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్థానిక కార్పొరేటర్ మహ్మద్ నజీరుద్దిన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం డివిజన్ పరిధిలోని హాకింపెట్ తబలే వాలా బస్తీలో కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్