నానల్ నగర్ డివిజన్ పరిధిలో అభివృద్ది పనులు వేగవంతం చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ నజిరుద్దీన్ తెలిపారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని సాలార్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. రూ. 18లక్షలతోఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.