హైదరాబాద్ లో వర్ష బీభత్సం

71చూసినవారు
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో నగరం చెరువులా మారింది. పలు ప్రాంతాలు వర్షం నీట మునిగాయి. పలు శివారు ప్రాంతాలు వర్షం నీటి లో చిక్కుకున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. ఎల్లో అలర్ట్ జారీ అయింది. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్