నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమాజిగూడ డివిజన్ రాజీవ్ గాంధీ చౌరస్తా పలు ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీమంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, వార్డు మెంబర్ నాగరాజు, విజయ్ యాదవ్, హరికృష్ణ స్థానిక నేతలు పాల్గొన్నారు.