శాసనమండలి సమావేశాలు రెండవ రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. శాసనమండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్లరంగు దుస్తులు ధరించి వెళ్లారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా శాసనమండలికి నల్లరంగు దుస్తులతో వెళ్లి నిరసన తెలిపారు. లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం లగచర్ల ఘటనపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.