ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ ముందు జేన్ కో లోని ఏఈ, కెమిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గురువారం ధర్నా చేపట్టారు. పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయిన నియమకపత్రలు ఇంకా ఇవ్వకపోవడంపై ఆందోళనకు దిగారు. అపాయింట్మెంట్ లెటర్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వేడుకొంటున్నారు.