తిరుపతిలో లడ్డు అపవిత్రకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ లైబ్రరీ సెంటర్ లో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని లడ్డుకి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అలాంటి లడ్డూను అపవిత్రం చేయడం హిందూ సమాజాన్ని కలచివేస్తోందన్నారు.