ఉద్యమ సమయంలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజలు, పాలాభిషేకాలు చేసిన కాంగ్రెస్ నేతలే తల్లిని మార్చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం కెపిహెచ్బి కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా ఉన్న బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తొలగించడం ఏంటని కృష్ణారావు నిలదీశారు.