కూకట్పల్లి నియోజకవర్గంలో 550 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నెల రోజులుగా ఇవ్వకుండా ఆపారని సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని చెప్తున్నారని, ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బందిగా ఉంటే మీరే చెక్కులను పంపిణీ చేయాలని తెలిపారు. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకు చెక్కులను అందించకపోతే ధర్నా చేపడతామన్నారు.