ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని దర్శించుకుని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించి స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.