ఏసీ బస్ షెల్టర్ లో పని చేయని ఫ్యాన్లు, ప్రయాణికుల ఇబ్బందులు

58చూసినవారు
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ లో ఫ్యాన్లు పని చేయడం లేదు. అసలే వేసవి వేళ ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులకు కనీసం ఫ్యాన్లు సైతం పని చేయకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతకు గురవుతున్నారు. బయట నిలబడాలంటే ఎండ, లోపల కూర్చోవాలంటే ఉక్కపోత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వెంటనే జోనల్ కమిషనర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్