కూకట్పల్లిలో గంజాయితో పట్టుబడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి

75చూసినవారు
కూకట్పల్లిలో గంజాయితో పట్టుబడ్డాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఖమ్మం నుంచి గంజాయి తీసుకొచ్చి సంతోశ్ అనే వ్యక్తి రమేశ్ బాబు ద్వారా విక్రయాలు చేయిస్తున్నాడు. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు నిందితుడిని వసంతనగర్ బస్టాప్లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రమేశ్ వద్ద నుంచి 1. 1 కేజీల గంజాయితో పాటు సెల్ ఫోన్ సీజ్ చేశారు. ఘటన పైన ఎస్టీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్