బస్తీ వాసులకు నోటీసులు.. మండిపడ్డ హైకోర్టు

55చూసినవారు
బాలానగర్ హస్మత్‌పేట బస్తీవాసుల వాదనలు వినకుండా వివరాలు లేని నోటీసులు జారీ చేయడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. తహశీల్దార్ జారీ చేసిన నోటీసులు కొట్టేసింది. హరిజనబస్తీకి చెందిన మల్లయ్యతో పాటు 9 మంది హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ కే. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. జారీ చేసిన నోటీసులో సర్వే నెంబర్లు లేవని తేల్చి చెప్పారు. అక్కడ పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణారావు కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్