సంతోష్ నగర్ పరిధిలో రోడ్డుపై అక్రమంగా వెలసిన దుకాణాలను శుక్రవారం ట్రాపిక్ పోలీసులు తీసి వేయించారు. పోలీసుల వివరాల ప్రకారం. ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వెళ్లే దారిలో రోడ్డుపై కొంతమంది వ్యక్తులు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తరచూ ట్రాపిక్ సమస్యలు ఏర్పడుతుండడంతో దుకాణాలను తొలగించారు. ట్రాపిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.