నిషేధిత చైనా మంజాలపై నగర టాస్క్‌ఫోర్స్ విభాగం, స్థానిక పోలీసులతో కలిసి నాలుగు నెలల్లో 107 కేసులు నమోదు చేసిందని టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు విలేకరుల సమావేశంలో వవరాలను వెల్లడించారు. సింథటిక్ నైలాన్, గ్లాస్ కోటింగ్‌తో తయారు చేసిన పతంగుల దారాలతో మనిషులతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలకు హాని జరుతుందని, ఈ నేపథ్యంలో చైనా మంజాలపై నిషేధం ఉందన్నారు.