చదువుతోనే మహిళలు వృద్ధి సాధించగలరని సావిత్రిబాయి పూలే చెప్పిన మాటలు నేటికీ ఆదర్శనీయమని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్లో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ. స్త్రీల అభ్యున్నతికి వారు చదువుకోడానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవను, పోరాటాన్ని కొనియాడారు.