మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని నియోజకవర్గ కార్పొరేటర్లతో శుక్రవారం కలిశారు. పెండింగ్ అభివృద్ది పనులపై వినతిపత్రం అందజేశారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే పలుచోట్ల నూతనంగా వాటర్ పైపు లైన్ పనులు చేపట్టాలని కోరారు. వీటికి సంభందించి తగిన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారిని ఎమ్మెల్యే కోరారు