ఓ వృద్ద మహిళ పై హత్యాయత్నానికి యత్నించి దొంగతనానికి పాల్పడిన ఘటనను శామీర్ పేట్ పోలీసులు చేదించారు. శనివారం శామీర్ పేట్ స్టేషన్ లో మేడ్చల్ డిసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. క్రైమ్ సిబ్బంది, సీసీఎస్ మేడ్చల్ సిబ్బంది సంయుక్తంగా శ్రమించి చోరీ కేసును చేదించారన్నారు. నిందితులు వనరాసి నరసింహ, అతని భార్య జ్యోతి లను అదుపులోకి తీసుకుని దొంగలించిన సొత్తును స్వాదీనం చేసుకున్నామన్నారు.