బిర్యానీలో బ్లేడ్ వచ్చిన ఘటన ఘట్కేసర్ లో జరిగింది. బాధితుడి ప్రకారం.. బీబీ నగర్ మండలం మక్త అనంతారంకి చెందిన బింగి ఐలయ్య అతడి ఫ్రెండ్స్ తో కలిసి ఆదర్శ్ బార్, రెస్టారెంట్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా అందులో బ్లేడ్ వచ్చింది. దీంతో షాకైనా కస్టమర్ యాజమాన్యాన్ని నిలదీయగా.. కావాలని రాలేదని, అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.