మేడ్చల్ మండలం కోనాయిపల్లి గ్రామ శివారులోని పోచమ్మ కుంటలో రైతులు పండించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని పాలట గ్రామానికి చెందిన మట్టి వ్యాపారస్తుడు రెవెన్యూ యంత్రాంగంతో కుమ్మక్కై రాత్రికి రాత్రి వందల సంఖ్యలో టిప్పర్ లతో మట్టిని తవ్వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన రెవెన్యూ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహశీల్దార్ వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు అన్నారు.