ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా ఆదివారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో జవహర్ నగర్ నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఎస్ రేవంత్ గౌడ్ గోల్డ్, కే మహేష్ సిల్వర్ సాధించారు. నవ్య సిల్వర్, అరుణ్ తేజ గోల్డ్ సాధించారు. కోచ్ లు కే నరేందర్, ఎమ్ అనిల్, సిహెచ్ గురు ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించారు.