మేడ్చల్ నియోజకవర్గ ఏ బ్లాక్ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా పెగుడ శ్యామ్ రావును నియమిస్తున్నట్లు సోమవారం మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పత్తి కుమార్ మరియు మేడ్చల్ మున్సిపల్ ఏ బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన పెగుడ శ్యామ్ రావుకు నియామక పత్రాన్ని అందజేశారు.