మేడ్చల్: పాన్ షాపులో గంజాయి చాకెట్ల పట్టివేత

84చూసినవారు
మేడ్చల్ జిల్లా  టాస్క్‌ఫోర్స్‌ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం తుంకుంటలో సోదాలు నిర్వహించారు. బీహార్ కు చెందిన ఉపేందర్ మండల్ అనే వ్యక్తి ఇంట్లో 85 ప్యాకెట్ల గంజాయి చాకెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఓ పాన్ షాప్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు దాడి చేసి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 25కు ఒక ప్యాకెట్ కొని ఒక్కొక్కటి రూ. 10 కి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్