మేడ్చల్: తెగిన చేతిని అతికించిన యశోద ఆసుపత్రి డాక్టర్లు

81చూసినవారు
మేడ్చల్: తెగిన చేతిని అతికించిన యశోద ఆసుపత్రి డాక్టర్లు
మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి డాక్టర్ జాముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓ పరిశ్రమలో పనిచేసే యువకుడి చెయ్యి మిషన్లో పడి పూర్తిగా తెగిపోయిందని, సమయానికి ఆసుపత్రికి వెళ్లగా ఆసుపత్రి సిబ్బంది తెగిపడిన చేతిని చికిత్స ద్వారా అతికించడం జరిగిందని తెలిపారు. ఇలానే చాలామంది తమ అవయవాలు కోల్పోతున్నారని సమయానికి ఆసుపత్రులకు చేరుకుంటే ఆధునిక చికిత్స ద్వారా అవయవాలను అతికించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్