కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై భారత పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా, మండల, యువజన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.