హైదరాబాద్ లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కప్రా మండలం జవహర్ నగర్లో మరో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు. జవహర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధి న్యూ భవానీ నగర్లో ఉండే పూర్ణిమ అనే విద్యార్థిని యాసిడ్ తాగి సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.