మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో గల గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రులు శనివారం 3వ రోజు సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందర దేవిగా గడ్డి మైసమ్మ తల్లిని పూజారులు అలంకరించారు. భక్తులు, మాలదారులు నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న పాలకుర్తి భవాని గౌడ్ తెలిపారు.