హైదరాబాద్: ఇదేనా ప్రజా పాలన అంటే: హరీశ్ రావు

76చూసినవారు
హైదరాబాద్: ఇదేనా ప్రజా పాలన అంటే: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రశ్నించారు. 'ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్