కొండపోచమ్మ సాగర్ లో ఇటీవల నీటి మునిగి మృతిచెందిన బన్సీలాల్ పేట్ సీసీ నగర్ కు చెందిన దినేశ్ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ హనుమంతరావు సోమవారం పరామర్శించారు. దినేశ్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆర్థికంగా దినేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కుటుంబానికి వీహెచ్ ఆర్థిక సాయం అందజేశారు. డివిజన్ ప్రెసిడెంట్ చిరంజీవి స్థానికులు పాల్గొన్నారు.