తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలాయ్ బలాయ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్, రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్డే, తదితరులు పాల్గొన్నారు.