మల్లేపల్లి డివిజన్ పరిధిలో ఆదివారం కార్పొరేటర్ జాఫర్ ఖాన్ ఇంటింటి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని, వాటర్ పాల్యూషన్ సమస్యలు ఉన్నాయని కార్పొరేటర్ గుర్తించారు. వెంటనే సిబ్బందితో, అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చూస్తామని స్థానికులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు.