బిసి కులగణన పూర్తయిన నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లను 20% నుంచి 42% కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బషీర్ బాగ్ లో అయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.