కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన, డిప్యూటీ మేయర్, కమీషనర్, అధికారులతో కలిసి శనివారం నిజాంపేట్ నగర పాలక సంస్థ 26వ సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు మంజూరైన అభివృద్ధి పనులు, చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగింది.