హైదరాబాద్ నగరంలో ఎరుపెక్కిన రహదారులు

50చూసినవారు
జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్‌నగర్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో సోమవారం మ్యాన్‌హోల్‌ నుంచి ఎరుపు రంగు నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. రెండు రోడ్లలో పారుతూ తీవ్ర దుర్గంధం రావడంతో నివాసితులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తున్నారని వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్