కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అనుష అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో ఆదివారం మృతదేహాన్ని గాంధీకి కాలేజీ యజమాన్యం తరలించింది. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని తరలించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కళాశాల వద్ద సోమవారం అనూష కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.