ప్రగతినగర్ ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలను గాల్లోకి సరైన జాగ్రత్తలు లేకుండా వదలడం వల్ల అక్కడ నివసించే కాలనీవాసులు చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటి పైన చర్యలు తీసుకొని పర్మినెంట్ సొల్యూషన్ చూపించగలరని ఆదివారం ఎంపీకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అల్లాడి మహేష్, చక్రి, కృష్ణమూర్తి, శ్రీకర్, రాజేందర్, కమల్, తదితరులు పాల్గొన్నారు.