

సనత్ నగర్: 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కి భట్టి ప్రత్యేక పూజలు
2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు బుధవారం ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు బడ్జెట్ ప్రతులకు పూజలు నిర్వహించి, భట్టి విక్రమార్క దంపతులకు ఆశీర్వచనం అందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.