

సనత్ నగర్: తిరుపతి రెడ్డికి మర్యాదలు ప్రజాస్వామ్యమా?
రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి దక్కుతున్న ప్రభుత్వ మర్యాదలు ప్రజాస్వామ్యమా? ఇదేనా రేవంత్ రెడ్డి ఇచ్చే ఎడో గ్యారెంటీ? అని మాజీ ఎమ్మేల్యే మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ కనీసం వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతి రెడ్డి చేత ఎందుకు పనులు ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. రేపు తిరుపతి రెడ్డి పేరు శిలఫలకాల మీద రాసి కేంద్ర ముఖ్యమంత్రి అని కూడా రాస్తారేమి అని ధ్వజమెత్తారు.