

హైదరాబాద్: సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ వద్ద సిర్పూర్ కాగజ్ నగర్‌కు చెందిన సురేష్ ఆదివారం అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు హైదర్, ఆనంద్ సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి అతని ప్రాణాలను రక్షించారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన సురేష్ చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ట్రాఫిక్ పోలీసుల చర్యను స్థానికులు అభినందించారు.