సీపీఐ నాయకులు బాలమల్లేష్, కృష్ణమూర్తి, ప్రసాద్ల మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం రాత్రి యాప్రాల్లో సంతాప సభ జరిగింది. మృత వీరుల ఆశయ సాధనకు అంకితం కావాలని, ఇదే వారికిచ్చే అసలైన నివాళి అని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్, జీవకన్, వీఎస్. బోస్, కాంతయ్య, పుట్టా లక్ష్మణ్, ఉమామహేశ్, దశరథ్, సహదేవ్, శంకర్ పాల్గొన్నారు.