కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్విలేజ్ మాడ్పోర్ట్ లోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. టీచర్లు సమయానికి వస్తున్నారా అని రిజిస్ట్రార్ బుక్ తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలు మొత్తం తిరిగి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా ఎమ్మెల్యే భోజనం చేసి తెలుసుకున్నారు.