తెలంగాణలో అతి పెద్దదైన బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఓసీకి రిజర్వుడ్ కావడంతో ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మంత్రులు, ముఖ్య కాంగ్రెస్ నేతలను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు.