ఊహకందని రీతిలో దివ్యాంగులకు చేయూతనిచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. సోమవారం నాడు ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 50 మంది దివ్యాంగులతో కలిసి, కేసిఆర్,
కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తూ, వచ్చే నెల నుండి 4116 రూపాయలు అందిస్తున్నారని, సోమవారం నాడు దివ్యాంగులతో, బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగిందని వారు తెలిపారు. దివ్యాంగులు మాట్లాడుతూ. దివ్యాంగులకు ఆసరాగా నిలుస్తున్న
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, కర్రె జంగయ్య, ఎజాజ్ బాయ్, మన్నె ఉదయ్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ భాయ్, జనరల్ సెక్రెటరీ హరినాథ్, మహిళా ప్రెసిడెంట్ లలిత, వార్డు మెంబర్ గడ్డం నర్సింగ్ రావు, డివిజన్ బీసీ సెల్ ప్రెసిడెంట్ మట్టి శ్రీనివాస్, డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బుర్రి యాదగిరి, డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ జాంగిర్ భాయ్, మహిళా నాయకులు ఉమక్క, శశికళ, సంతోషి దేవి, తదితరులు పాల్గొన్నారు.